సిద్దుల గుట్టపై ప్రత్యేక పూజలు.. అన్నదానం

నవతెలంగాణ – ఆర్మూర్

పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్టపై సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ గల శివాలయం, రామాలయం,దుర్గామాత, దత్తాత్రేయ, అయ్యప్ప, ఏకశీల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో వివిధ జిల్లాల నుండి విచ్చేసిన 15వేల మంది భక్తులు హాజరైనారు. గుద్దేటి మహేశ్వర్ …గాయత్రి దంపతులు అన్నదాతలుగా వ్యవహరించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి, ప్రశాంత్ గౌడ్ ,హజారి సతీష్ ,చరణ్ రెడ్డి ,కొంతం మురళి, మంజుల ,సిద్దలగుట్ట సేవా సమితి భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.