
యాదగిరిగుట్ట మండలం సైదాపూరం శనివారం, ధన్వంతరి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలోని నిర్వహిస్తున్న హోమంలో పాల్గొన్నారు. బీర్ల ఐలయ్య కి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, మండల అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, మాజీ ఉపసర్పంచ్ దుంబాల సురేఖ వెంకటరెడ్డి, శిఖ ఉపేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.