పోచారం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద గల గంగమ్మ ఆలయం వద్ద జడ్పిటిసి సభ్యుడు మనోహర్ రెడ్డి బుధవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గంగమ్మ తల్లి ఆలయం వద్ద ఐదు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించు కోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత 16 సంవత్సరాలు నుండి వర్షాకాలం ప్రారంభంలో యధావిధిగా 5 కొబ్బరికాయలు కొట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో  నిండాలని కోరుకున్నట్లు అయినా తెలిపారు.  ఆయన వెంట దుర్గారెడ్డి, కృష్ణ , ధనుంజయ్, మల్లేష్, వంశీ గౌడ్ తదితరులున్నారు.