ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు

– దర్శించుకున్న మేయర్ దంపతులు
నవతెలంగాణ – కంటేశ్వర్
అయోధ్య బాల రామ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా నగరంలోని ప్రాచీన ఆలయం ఖిల్లా రామయంలో ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ నగర మేయర్ దంపతులు దండు నీతూ కిరణ్ శేఖరు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ.. వందల సంవత్సరాల హిందువుల చిరకాల ఆశయం,  ఆరాధ్య దైవం రామజన్మ భూమి ఆయోధ్యయంలో రాముని విగ్రనికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా ఖిల్లా రామాలయం, జెండా బాలాజీ ఆలయం మరియు గోల్ హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్.ఆర్. చౌరస్తా లోని హనుమాన్ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగర మేయర్ తో నుడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అనిల్, ఆలయాల చైర్మన్లు జాలిగాం గోపాల్, నీలగిరి రాజు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.