
యాదగిరిగుట్ట మండలం కాచారం ఆదివారం, శ్రీ గౌరీ రేణుక వాసవి బసవ లింగేశ్వర స్వామి కైలాసపురం దైవ దేవాలయ 27వ వార్షికోత్సవం, అన్నపూర్ణ అన్న సత్రం 28వ వార్షికోత్సవంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వంగపల్లి అంజయ్య స్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. అనంతరం లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీశైలం, ఎంపీటీసీ ఎడ్ల సుగుణమ్మ రాంరెడ్డి, ఎడ్ల రామ్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.