గురుపౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
గురుపౌర్ణమి సందర్భంగా చిట్టాపూర్  సాయి బాబా ఆలయంలో ఘనంగా  ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ లో గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు , అర్చనలు, హారతి లు చేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.