సిద్దుల గుట్టపై ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్టపై భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించినారు. శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం, దుర్గామాత, దత్తాత్రేయ అయ్యప్ప, ఎల్లమ్మ ,ఏకశీల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి సుమన్, పిసి గంగారెడ్డి ,కొంతం మంజుల, ముక్క సూరజ్, పొద్దుటూరి చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.