మాఘ అమావాస్యను పురస్కరించుకొని శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – మిరు దొడ్డి
మాఘ అమావాస్యను పురస్కరించుకొని శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు ఎడ్లబండ్ల ఊరేగింపును రైతులు నిర్వహించారు. అల్వాల గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఎడ్లబండ్లను ఆలయం వద్ద ఊరేగించడంతో ఆధ్యాత్మిక ఓరవడి నెలకొంది. కోదండ రామస్వామి ఆలయం వద్ద నిర్వహించిన జాతర మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మిరుదొడ్డి, సిద్దిపేట, దౌల్తాబాద్, తొగుట మండలాల నుండి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున ఆనవాయితీగా ఎడ్లబండ్లను ఊరేగించడం జరుగుతుందని తెలిపారు. పాడి, పంటలు సమృద్ధిగా ఉండేందుకు ప్రతి సంవత్సరం ఎడ్లబండ్ల ఊరేగింపు చేస్తున్నామని అన్నదాతలు వెల్లడించారు.