మండల పరిధిలోని వెంకటాపురంలోగల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామీ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంబారాధన, చతుస్థానార్చన, నిత్యాహోమాలు, సుదర్శన నారసింహ ఇష్టి,పూర్ణాహతి,బలిహరణం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తoగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సల్వాది మోహన్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి,ధర్మకర్తలు,అర్చకులు,సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.