
లోకకళ్యాణార్థం శ్రీ సదానంద ఆశ్రమంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిరుదొడ్డి శివారులోని సదానంద ఆశ్రమంలో పురోహితుడు రాజకుమాయే శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ఆరేపల్లి లక్ష్మీ నగర్ ధర్మారం మిరుదొడ్డి గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎంతో వైభవంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణాన్ని భక్తులు ఆధ్యాంతం తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణతోపాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.