వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు 

Special Pujas at Veerabhadra Swamy Templeనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకుని యాదగిరిగుట్ట మండలం సైదాపూరం శుక్రవారం, వీరభద్రస్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్ ముక్యర్ల మల్లేష్ యాదవ్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షులు బందరపు భిక్షపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.