
మహా శివరాత్రి సందర్భంగా యాదగిరిగిగుట్ట మండలం సైదాపురం శుక్రవారం, సొంత గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో వీరభద్ర స్వామిని బీర్ల అనిత ఐలయ్య, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని, అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగళ హారతి ఇచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వీరభద్ర స్వామి వారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దుంబాల సురేఖ వెంకట్ రెడ్డి, శిఖ ఉపేందర్ గౌడ్, సుబ్బురి ప్రశాంత్, కౌన్సిలర్ ముకర్ల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.