నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ప్రజల సంక్షేమం కోసం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు పూజా కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఏకాదశి పర్వదినాన నియోజకవర్గ ప్రజలంతా సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించుకున్నమన్నారు. ప్రజలంతా వచ్చి సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా పాడి పంటలతో మంచి వర్షాలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సత్యనారాయణ స్వామి వేడుకున్నాట్లు తెలిపారు. కరీంనగర్ ,సిద్దిపేట జిల్లా కలెక్టర్ లు పమేలా సత్పతి, మిక్కిలినేని మను చౌదరి తదితరులు పాల్గొన్నారు.