కైలాసపురంలో మార్గశిర మాస మంగళవారం ప్రత్యేక పూజలు

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో ఆలేరు సమీప ప్రాంతం కైలాసపురం లోని శ్రీ వాసవి బసవలింగేశ్వర రేణుకా మాత దేవాలయంలో మార్గ శిర మాస మంగళవారం సందర్భంగా దేవాలయ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. మిర్యాలగూడ పట్టణ వాస్తవ్యులు మార్కండేయ భక్తులు గంజి విజయ్ కుమార్ సునీత లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి చీరే సారే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదం, బేబీ ప్రియా సారీ సెంటర్ మిర్యాలగూడ వారి వార్షికోత్సవమ్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ తెలుగు న్యూస్ చానల్ సీఎండీ సామా శ్రీధర్ దంపతులు, జైన శ్రీనివాస్ వసంత, మార్కండేయ భక్తులు కోడి అరుణ తేజ, సిద్దిపేట వాస్తవ్యులు ప్రసాద్ రవళిలు, ఆలేరు వాస్తవ్యులు శ్యామల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.