యాదగిరిగుట్ట మండలంలోని కాచారం గ్రామంలో మంగళవారం, ఆలేరు సమీప ప్రాంతం కాచారం కైలాసపురం లోని శ్రీ వాసవి బసవలింగేశ్వర రేణుకా మాత దేవాలయంలో కార్తీకమాసం చివరి మంగళవారం సందర్భంగా దేవాలయ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం మహోత్సవ ప్రసాదం పంపిణీ చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి కార్యక్రమాలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదం సిద్దిపేట వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త గౌరిశెట్టి (కాశి యాత్ర) ఆంజనేయులు గుప్త సతీమణి కీర్తిశేషులు భాగ్యలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ తెలుగు న్యూస్ చానల్ సీఎండీ సామా శ్రీధర్ దంపతులు , మార్కండేయ భక్తుడు ఆలేరు వాస్తవ్యులు శ్యామల కిష్టయ్య, గౌరిశెట్టి శ్రీనివాస్ శ్రీవిద్య దంపతులు, నల్లగొండ జిల్లా చిత్తలూరు వాస్తవ్యులు మార్కండేయ భక్తులు తల్లి కుమారులు అరుణ తేజ తదితరులు పాల్గొన్నారు.