పూర్ణగిరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు…

– అన్నప్రసాద వితరణ….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో గల స్వయంభు శ్రీ సుదర్శన  లక్ష్మీనరసింహస్వామి పూర్ణగిరి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు బత్తిని రాములు గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక విశిష్టత ఉందని,  పూర్ణగిరిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం ప్రసాద పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో  ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు ఎల్లంల జంగయ్య యాదవ్, మాజీ దేవాలయ చైర్మన్ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, నాళ్ల చందు, మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్, మన్నేవారి పంపు  మాజీ సర్పంచ్ బోయిని పాండు,  వెంకటేశం పంతులు, శేఖర్, వెంకటేష్, ఉపేందర్, వడిచెర్ల కృష్ణ, వెంకటేష్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.