లచ్చన్ గ్రామంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో మంగళవారం నాడు గ్రామ ప్రజలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో జరుపుకునే గ్రామదేవతల పండుగలను గ్రామ ప్రజలంతా భాజా భజంత్రీలతో నైవేద్యాలు సమర్పించి ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలు గ్రామ ప్రజలకు సుఖసంతోషాలతో ఉంచాలని పాడి పంటలు బాగా పండాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈ పండుగ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు యువకులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.