ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియకు విశేష స్పందన

నవతెలంగాణ – బెజ్జంకి
కరీంనగర్ జిల్లా పరిపాలనాధికారి అదేశం మేరకు మండలంలోని అయా గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియకు విశేష స్పందన లభించినట్టు తహసిల్దార్ ఎర్రోల్ల శ్యామ్ తెలిపారు. అదివారం మండలంలోని అయా గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను తహసీల్దార్ శ్యామ్ క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించారు. మండల వ్యాప్తంగా ఫారం 6 కు 25,ఫారం 8 కు 2 దరఖాస్తులు స్వీకరించినట్టు తహసిల్దార్ తెలిపారు.ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియలో అయా గ్రామాల్లోని బీఎల్ఓలు అందుబాటులో ఉండి విజయవంతం చేశారని తహసిల్దార్ అభినందించారు.