సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ తాజా మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని స్లేట్ హైస్కూల్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ ముగ్గుల పోటీలలో దాదాపు 100 మంది మహిళలు పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి పొనకల్ తాజా మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి లావుడియా స్వప్న, ద్వితీయ బహుమతి జునుగురి శ్వేత, తృతీయ బహుమతి బండారు రవళి లు అందుకున్నారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు కస్తూరి సతీష్, జక్కు శ్రీనివాస్,భూతం శ్రీనివాస్, నరేందుల గోపాల కృష్ణ, అరవింద్ ,శ్రీనివాస్,బబ్లూ తదితరులు పాల్గొన్నారు.