
నవతెలంగాణ -మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత సర్పంచ్ ల పదవీకాలం ఫిబ్రవరి1తో ముగియనుంది.ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలుపలేదు.దీంతో ఎన్నికలు నిర్దేశిత గడువులోపు జరగవని,ప్రత్యేక అధికారుల పాలన తప్పనిసరిని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమజ్జమైయ్యారు.ఇందులో భాగంగా మండలస్తాయి అధికారులను సేకరించినట్లుగా సమాచారం.
మండలంలో ప్రత్యేక అధికారులు వీరే….
మండలంలోని 15 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారులను ఉన్నతాధికారులు ఇప్పటికే నియమించినట్లుగా విశ్వనీయ సమాచారం. 1,తాడిచెర్ల గ్రామానికి బి.విక్రమ్ కుమార్ (మండల పరిషత్ ఎంపిఓ), 2,మల్లారం గ్రామానికి జి. నరసింహమూర్తి (మండల ఎంపిడిఓ పరిషత్ అధికారి), 3, పెద్దతూoడ్ల గ్రామానికి కె.దుర్గాప్రసాద్ (ఏఈఓ అగ్రికల్చర్), 4, చిన్నతూoడ్ల గ్రామానికి సరితా (రెవెన్యూ ఇన్స్పెక్టర్), 5, వళ్లెంకుంట గ్రామానికి ఎస్.అనూష (ఏఈఓ అగ్రికల్చర్ ),6, కొండంపేట గ్రామానికి ఎస్.శ్రీనివాస్ (రెవెన్యూ డిప్యూటీ తహశీల్దార్ ) 7, ఇప్పులపల్లి గ్రామానికి ఆర్.కమల (ఐకెపి ఎపిఎం), 8,కొయ్యుర్ గ్రామానికి ఏ.సుధాకర్ (మండల వ్యవసాయ అధికారి) 9,ఎడ్లపల్లి గ్రామానికి బి.అశోక్ కుమార్ (పంచాయతీ ఏఈ), 10, నాచారం గ్రామానికి కె.మనీషా (ఏఈఓ అగ్రికల్చర్),11, మల్లంపల్లి గ్రామానికి ఎస్.శిరీషా (ఏఈఓ అగ్రికల్చర్),12, ఆన్ సాన్ పల్లి గ్రామానికి ఎం.హరిత (ఏఈ) , 13, రుద్రారం గ్రామానికి పి.శ్రీనివాస్ (మండల తహశీల్దార్), 14, అడ్వాలపల్లి గ్రామానికి వి.సరస్వతి (అంగన్ వాడి సూపర్ వైజర్), 15, దుబ్బపేట గ్రామానికి జి. శ్రీరామమూర్తి (మండల పరిషత్ సూపర్ డెంట్) తదితరులను గ్రామాలకు స్పెషల్ అధికారులుగా నియమించినట్లుగా తెలుస్తోంది.