గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామాల్లో  ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీలు లను శుభ్రం చేశారు. మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ప్రత్యేక అధికారి మైలారం గంగాధర్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ తోట జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, విఓఏ లు, ఏఎన్ఎమ్, ఆశ వర్కర్లు, మహిళ సంఘం సభ్యులు, రేషన్ డీలర్లు ముత్తెన్న, రవీందర్, యూత్ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.