నవతెలంగాణ-గోవిందరావుపేట: సంక్రాంతి పండగ సందర్భంగా మండలంలో కోడిపందాలు వేసేవారిని పట్టుకునేందుకు స్పెషల్ దీవెనలు ఏర్పాటు చేసినట్లు పసర ఎస్ ఐ షేక్ మస్తాన్ తెలిపారు. శనివారం పసర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సై మస్తాన్ మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్బంగా మండలంలో కోళ్ల పందాలు వేసేవారికి పళ్ళు హెచ్చరికలను జారీ చేశారు. కోళ్ల పందాలు చట్టవ్యతిరేకమైనవి.ప్రజలు ఎవరు అయిన అందులో పాల్గోనిన, నిర్వహించిన చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని పసర పోలీసు సిబ్బంది తో వీటిని పట్టుకునుటకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేయటం జరిగింది అని అన్నారు.కావున ప్రజలెవరు కూడా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాల జోలికి వెళ్లకుండా పండుగను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. పందాలు పాడుతూ దొరికినట్లైతే శిక్షలు కఠినంగా ఉంటాయని, అలాంటి ఆలోచనలే రాకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కోరారు.