నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలములో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు అయిన ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు ఇండ్ల కోసం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు జడ్పి సిఈఓ ఎన్ శోభారాణి తెలిపారు. సోమవారం ఆమె గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. రేపటి నుండి 21.1.25 నుండి 24.1.25 వరకు 4 రోజులలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించ వలెనని, ఈ 4 పథకాలకు సంబంధించిన జాబితాలను గ్రామ సభలో చదివి వినిపించి, ఇంకను అర్హులు అయిన వారు ఉంటే దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సి హెచ్ శ్రీనివాస్, ఇంచార్జ్ తహసీల్దార్ కళ్యాణ్, ఎంపీఓ mpo దినకర్ , గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.