రేపటి నుండి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

– ఎన్ సృజన్ కుమార్ తహసిల్దార్ 
నవతెలంగాణ-గోవిందరావుపేట : జిల్లా ఎన్నికల అధికారి ములుగు ఆదేశానుసారం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమము
తేదీ. 09.11.2024 to 10.11.2024 లలో నిర్వహిస్తున్నామని స్థానిక తహసిల్దార్ ఎన్ సృజన్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో సృజన్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని పోలింగ్ స్టేషన్లలో తేదీ.01.01.2025  నాటికి 18 సంవత్సరాల నిండిన యువతి, యువకులు  ఫారం -6, ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఫారం -7, అభ్యంతరాలు తెలపడానికి  ఫారం- 8  తప్పు ఒప్పులు సవరణలు  దరఖాస్తులు స్వీకరించబడునని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5  గంటల వరకు  అర్హులైన వారు సంబంధిత పోలింగ్ స్టేషన్లో  అందరు తప్పకుండ నమోదు చేసుకోగలరని నూతనంగా ఓటు నమోదు చేయించుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.