మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఆరంభం’. ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజరు నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన సినిమా సక్సెస్ మీట్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినరు రెడ్డి మామిడి మాట్లాడుతూ,’చూసిన వాళ్లంతా మూవీలో ఎమోషన్ బాగుంది, డ్రామా బాగుందని చెబుతున్నారు’ అని తెలిపారు. ‘నిన సాయంత్రం థియేటర్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది’ అని నిర్మాత అభిషేక్ వీటీ చెప్పారు. దర్శకుడు అజరు నాగ్ వి మాట్లాడుతూ, ‘థియేటర్‌లో క్లైమాక్స్‌కు స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది. మౌత్ టాక్‌తో పాటు కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి.