అసెంబ్లీ ఎన్నికలకు స్పీడు పెంచిన కారు..

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
పీపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు గెలుపును కాంక్షిస్తూ.. ఆళ్ళపల్లి బారాస మండల ప్రధాన కార్యదర్శి,  18,19వ బూత్ కో-ఆర్డినేటర్ షేక్ బాబా, పీనపాక  నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి,18వ బూత్ ఇంచార్జ్ సయ్యద్ ఆరిఫ్, సీనియర్ నాయకులు తెలగాని రాము, మద్దెల. వెంకటేశ్ కారు గుర్తుకు ఓటేయాలని రెండు బూతుల గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు. అందులో భాగంగా సీతారాంపురం గ్రామంలో గడపగడపకు బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో కెసిఆర్ బీమా పథకం ప్రతి ఇంటికి ధీమాగా మారిపోతుందని అన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేశామన్నారు. మహిళలకు నెలనెల 3 వేలు ఇవ్వడంతో పాటు అన్నపూర్ణ పథకం కిందట రేషన్ షాపు ద్వారా సన్నబియ్యం, మహిళా సంఘాలకు మరింత బలోపేతం చేయడానికి సౌభాగ్య లక్ష్మీ పథకం మహిళలకు ఎంతో మేలు చేసేదన్నారు. ఆసర పింఛన్లు రానున్న ఐదేళ్లలో 5 వేలు, దివ్యాంగుల పెన్షన్లు 6వేలకు పెంపు వంటి అనేక సంక్షేమ పథకాలు పార్టీ అమలు చేస్తుందని వారు చెప్పారు. ఈ ప్రచారంలో కండె నారాయణ, కండె కృష్ణ, కండె మహేష్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.