
అటవీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఎఫ్ డీ ఓ కె. దామోదర్ రెడ్డి స్థానిక అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అడవుల ఆక్రమణలు,పోడు నియంత్రణపై నిఘాను పటిష్టం చేయాలని చెప్పారు. మండలంలోని వినాయకపురం,కావడిగుండ్ల, అశ్వారావుపేట ఫారెస్ట్ సెక్షన్ల లో శుక్రవారం ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా ప్లాంటేషన్ ను, పనులను తనిఖీ చేశారు.అడవుల అభివృద్ధిపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని, విధులు పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్లాంటేషన్ నిర్వాహణపై పలు సూచనలు చేశారు. ఆయన వెంట రేంజర్ మురళీ, ఫారెస్టర్ సంపత్ కుమార్, సిబ్బంది ఉన్నారు.