– జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి
– శేరిలింగంపల్లి జోన్‌లో పర్యటన
నవతెలంగాణ-మియాపూర్
శేరిలింగంపల్లి జోన్‌లో చేపట్టిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్ర పాలి అధికారులు ఆదేశించారు. మంగళవారం ఉదయం శేరిలింగంపల్లి జోన్‌లో ఆమె విస్తృతంగా పర్యటించారు. గచ్చిబౌలి వద్ద చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలని అందుకోసం సేకరిం చాల్సిన ఆస్తుల యజమానులకు టీడీఆర్ లేదా నగదు రూపంలో పరిహారం అందజేసే ప్రక్రియను ముమ్మరం చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి కోర్టు కే సులు ఏమున్నా ఉంటే వాటిపై దృష్టి సారించాలని ఆదే శించారు. అనంతరం ఐఐటీ జంక్షన్ లింగంపల్లి ఆర్ యూబీ మజీద్ బండ పరిసరాలను కమిషనర్ ఆమ్రపాలి తనిఖీ చేశారు. జంక్షన్ల అభివృద్ధి, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు పను లను వేగవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమ స్యలు నెలకొనకుండా అధికారులు పలు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కూడళ్లను మరింతగా సుంద రీకరించాలని అన్నారు.
కొత్త ప్రాజెక్టులకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని కమిషనర్ సూచిం చారు. మసీద్‌బండ గచ్చిబౌలి రోడ్డు వరకు విస్తరణ కోసం చేపట్టిన పనులలో, కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అ ధికారులను ఆదేశించారు. ఐటీ ప్రాంతంలో సుందరీ కరణ పనులు, రహదారి విస్తరణ పనులు వేగంగా జరగాలని ఆమె స్పష్టం చేశారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, ఎస్సార్ డీపీ సీఈ దేవానంద్, ప్రాజెక్టు విభాగం అధికారులు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.