ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయండి

– తాసిల్దార్ తోట రవీందర్

– బిఎల్వోలతో సమావేశం

నవతెలంగాణ -తాడ్వాయి: ప్రభుత్వం కొత్త ఓటర్ల నమోదు కోసం చేపడుతున్న ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బీఎల్‌ఓలు వేగవంతం చేయాలని తాడ్వాయి తాసిల్దార్ తోట రవీందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో బి ఎల్ ఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ తోట రవీందర్ మాట్లాడుతూ 01 జనవరి 2024 వరకు కొత్త ఓటరు నమోదు కార్యక్రమం మరొకసారి అవకాశం కల్పించారని 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఫాం -6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు. అలాగే ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో బీఎల్‌ఓలు ఓటర్ల పేర్ల సవరణ, చనిపోయిన ఓట్లర పేర్లను తొలగించాలన్నారు. ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బిఎల్వోలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సురేష్ కుమార్, బి ఎల్ వో లు సరోజన, జమున, నిర్మల, రమ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.