
మంత్రి శ్రీధర్ బాబు సూచనమేరకు రామగిరి మండలం బేగంపేట గ్రామం కమ్మరివాడలోని డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతమాయ్యాయి. పంచాయతీ రాజ్ ఏఈ వరలక్ష్మి సోమవారం మురుగునీటి కాలువను పరిశీలించారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కమ్మరివాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని త్వరితగతిన డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలనీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ ఏఈ వరలక్ష్మిని కోరారు.