– చెపాక్‌లో బట్లర్ సేనకు కఠిన పరీక్ష
– 2-0 ఆధిక్యంపై టీమ్ ఇండియా గురి
– భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 నేడు
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో…
పొట్టి ఫార్మాట్లో పరుగుల వరదతో రికార్డులు ఎగిరిపోతాయని ఎదురు చూస్తే.. స్పిన్ మాయజాలంతో ఇంగ్లాండ్ పరుగుల వేటలో పడిపోయింది. మాయకు ఈడెన్‌లోనే ఇంగ్లాండ్‌కు మతిపోగా.. నేడు చెపాక్‌లో మ్యాజిక్‌ను ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌తో పాటు ఆదిల్ రషీద్ మాయజాలం ప్రదర్శించేందుకు ఎదురుచూస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 నేడు.
నవతెలంగాణ-చెన్నై
భారత్, ఇంగ్లాండ్ టీ20 సమరం చెపాక్‌కు చేరుకుంది. ఈడెన్‌లో ఇంగ్లాండ్‌పై ఏకపక్ష విజయం సాధించిన టీమ్ ఇండియా నేడు 2-0 ఆధిక్యంపై కన్నేసి బరిలోకి దిగుతోంది. భారీ హిట్టర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చెపాక్‌లో స్పిన్ సవాల్‌ను ఎదుర్కొవటంపై దృష్టి సారించింది. బ్యాట్‌తో, బంతితో సూపర్ షో చేసిన సూర్యకుమార్ సేన చెపాక్‌లో ఆ ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తోంది. చెన్నైలో భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 నేడు.
ఎదురుందా?
ఈడెన్‌లో భారత్ అదరగొట్టింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దంచికొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాదాడు. సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ సైతం ధనాధన్ ఇన్నింగ్స్‌లు బాకీ పడ్డారు. అభిషేక్ శర్మ వన్‌మ్యాన్ షోతో లోయర్ మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డిలకు బ్యాటింగ్ అవకాశం దక్కలేదు. ఆసీస్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి.. పొట్టి ఫార్మాట్లో ధనాధన్ మెరుపులు చూపించాలని తపిస్తున్నాడు. స్పిన్ పిచ్‌లు కావటంతో నితీశ్‌కు బౌలింగ్ చేసే అవకాశం సైతం దక్కటం లేదు. హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాలని ఎదురుచూస్తున్నాడు. బంతితో భారత్ మరింత బలంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యతో కలిసి అర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకుంటున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతున్న టీమ్ ఇండియా.. బట్లర్ సేనకు చుక్కలు చూపిస్తోంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవి బిష్ణోరు మాయజాలం ముంగిట ఇంగ్లాండ్ బ్యాటర్లు తేలిపోతున్నారు. చెపాక్‌లో నల్ల మట్టి పిచ్‌పై మన స్పిన్ త్రయాన్ని ఎదుర్కొవటం ప్రత్యర్థికి కఠిన పరీక్షగా నిలువనుంది.
పుంజుకుంటారా?
ఇంగ్లాండ్ బలంగా ఉంది. కానీ భారత్ స్పిన్ అస్త్రంతో ఎదురుదాడి చేయటంతో బట్లర్‌సేన ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ సహా జాకబ్ బెతెల్ రూపంలో భారీ హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. జోశ్ బట్లర్‌కు స్పిన్, పేస్పై మంచి రికార్డుంది. అయినా, నాణ్యమైన భారత స్పిన్నర్లపై బౌండరీలు బాదటం ఇంగ్లాండ్‌కు కత్తిమీద సాముగా తయారైంది. బౌలర్లు సైతం ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. మార్క్‌వుడ్, గస్ అటిక్సన్లు ఈడెన్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఆర్చర్, రషీద్‌లపై వికెట్ల వేట భారం పడింది. బంతితో, బ్యాట్‌తో సమిష్టిగా మెరిస్తేనే నేడు ఇంగ్లాండ్ సిరీస్‌లో లెక్క సమం చేసేందుకు వీలుంటుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోరు, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోశ్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియాం లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జేమీ ఓవర్టన్, గస్ అటిక్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్.