స్పిన్‌ దిగ్గజం యాదిలో..

Spin giant Yadi..లక్నో : భారత క్రికెట్‌ స్పిన్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడికి రోహిత్‌సేన సముచిత గౌరవం అందించింది. ఐసీసీ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లో బేడికి గౌరవ సూచకంగా నల్ల బ్యాడ్జిలతో టీమ్‌ ఇండియా బరిలోకి దిగింది. 1967-1979లో భారత్‌కు 67 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన బేడి 266 వికెట్లు పడగొట్టాడు. పది వన్డేల్లోనూ మాయ చేసిన బేడి భారత తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించారు. అమృత్‌సర్‌లో జన్మించిన బిషన్‌ సింగ్‌ బేడి.. 77 ఏండ్ల వయసులో గత సోమవారమే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బ్లాక్‌ ఆర్మ్‌బ్యాండ్స్‌ ధరించిన భారత క్రికెటర్లు దిగ్గజ క్రికెట్‌కు ఘన నివాళి అర్పించారు.