మాక్లూర్ గ్రామానికి కి ఆధ్యాత్మిక కళ

– అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండు రంగ విఠలేశ్వర దేవత ఆలయాల నిర్మాణం
– ఆధ్యాత్మిక వైభవం విరజిల్లెల ఆలయాలు నిర్మాణం
– వేలాదిగా తరలిన భక్తులు
– 10000 మందికి అన్న ప్రసాదం వితరణ
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  గణేష్ బిగాల  టిఆర్ఎస్ పార్టీ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్  మహేష్ బిగాల  కుటుంబ సభ్యులు అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండు రంగ విఠలేశ్వర దేవత ప్రతిష్ట పున:శ్చరణ కార్యక్రమంలో సోమవారం నిర్వహించారు.జిల్లా మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి  , నగర మేయర్  దండు నీతూ కిరణ్ ,జడ్పీ చైర్మన్ శ్రీ విఠల్ రావు ,నుడ చైర్మన్  ప్రభాకర్ రెడ్డి , కార్పొరేటర్లు,నాయకులు,గ్రామ ప్రజలు లు అయ్యప్ప సహిత, ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీ రుక్మిణి పాండు రంగ విఠలేశ్వర దేవత మూర్తులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆశీర్వాదం తీసుకున్నారు.