ఆత్మీయ పలకరింపులు…కుశల ప్రశ్నలు

– అఓటర్లకు నేతల సకల మర్యాదలు
నవతెలంగాణ-బొమ్మలరామారం
అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చి, అయ్యా ఆదుకోండి అని దగ్గరికి వెళితే నేడు, రేపు అంటూ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయించుకునే నాయకులు ఎన్నికలవేళ… ఓటరు దేవుడి దర్శనం కోసం ఎండనక వాననక రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అయ్యా, అవ్వ, అక్క, చెల్లి, అన్నా, తమ్ముడు అంటూ సామాన్యుడు చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ మళ్లీ తారసబడుతున్నారు. కుశల ప్రశ్నలు వేస్తూ నన్ను మర్చిపోకండి అంటూ రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. పదవి మీద ఉన్న ప్రేమ… మామూలు సమయంలో ఎవరు వచ్చినా, ఏమడిగిన స్పందించని నేతలు…. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు వీలైనంత తొందరగా అక్కడ వాలిపోతున్నారు. బాధితులను పరామర్శించి, తోచినంత ఆర్థిక సాయం చేస్తూ. ఆ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వటం గమనార్హం. ఇలా ఎప్పటికప్పుడు నియోజకవర్గం చుట్టూ ముడుతూ ప్రజలను ఆకట్టుకునే యంత్రం చేశాడంతో సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల అనగానే రాజకీయ నాయకులు అందరూ ఇలా పల్లెల్లో వాలిపోతారని, మిగతా సమయంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా రానివారు.. ఓటు కోసం ఇలా తిరగడం ఎంత స్వార్థం అని వాపోతున్నారు. పదవి మీద ఉన్న ప్రేమ.. సగటు జీవి పై చూపిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.