ఓకే ప్లే ఇండియా షేర్ల విభజన

ఓకే ప్లే ఇండియా షేర్ల విభజనహైదరాబాద్‌ : ప్లాస్టిక్‌ మౌల్డెడ్‌ ఫర్నిచర్‌, అవుట్‌డోర్‌ ప్లే ఎక్విప్‌మెంట్‌, ఆటోమోటివ్‌ పరికరాలు తదితర రంగాల్లో ఉన్న ఓకే ప్లే ఇండియా లిమిటెడ్‌ తనషేర్లను విభజిస్తున్నట్టు తెలిపింది. ఈక్విటీ షేర్లు 10.1 నిష్పత్తిలో జారీ చేయనున్నట్లు పేర్కొంది. అనగా రూ.10 ముఖ విలువ కలిగిన షేర్‌ను రూ.1 విలువ గల 10 షేర్లగా విభజన చేయడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కాగా.. దీనికి వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉంటుంది.