
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని తరగతి గదులు, విద్యార్థినిల నోట్ బుక్స్, భవనం, స్విచ్ బోర్డ్స్, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, టాయిలెట్స్, కళాశాల మైదానం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. గతేడాది ఇంటర్ ఫలితాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కళాశాల మైదానంలో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తరగతి గదులు, ఆవరణలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. కళాశాలలో కావాల్సిన సౌకర్యాలపై ఒక నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఆయా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రమోద్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.