జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం

– ఏ ఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ గిరిరాజ్
నవతెలంగాణ –  కంటేశ్వర్
విధి నిర్వహణలో నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని  ఏఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ గిరిరాజ్ తెలిపారు.  ఈ మేరకు శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే పురస్కరించుకుని నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ లో భాగంగా క్రికెట్ పోటీ లను ఆయన ప్రారంభించారు. పోలీస్ పరేడ్ మైదానంలో రెండు రోజుల పాటు జరిగే పోటీల్లో 5 జట్లు పాల్గొంటున్నాయి. జిల్లా ఫైర్ అఫీసర్ నర్సింగ్ తో కలిసి పోటీలను ప్రారంభించిన ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. ప్రతి ఏటా రెండు సార్లు స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మానసికంగా ఒత్తిడి ని అధిగమించేందుకు శారీరక శ్రమ దృఢత్వం అవసరమని సూచించారు. క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు.జర్నలిస్టులు క్రీడా స్ఫూర్తిని ఛాటాలన్నారు. మొదటి రోజు మూడు లీగ్ మ్యాచ్ లు జరుగగా రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధించాయి.కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్   ఆర్గనైజర్లుగా జెట్టి గోవిందరాజు మహిపాల్ లతో పాటు సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.