జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం

– అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా 
నవతెలంగాణ –  కంటేశ్వర్
జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం అనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో గంగా టీం(సాక్షి రాజు కుమార్) వర్సెస్ హరిద్ర (పంచ రెడ్డి శ్రీకాంత్) టీం మధ్యలో ఫైనల్ మ్యాచ్ ఉదయం జరగగా ప్రారంభ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ..విధి నిర్వహణలో నిత్యం మానసిక ఒత్తిడికి గురయ్యే జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే పురస్కరించుకుని నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ లో భాగంగా క్రికెట్ పోలీస్ పరేడ్ మైదానంలో రెండు రోజుల పాటు జర్గిన క్రికెట్ టోర్నమెంట్ లో  ఆయన కాసేపు క్రికెట్ ఆడారు. ప్రతి ఏటా రెండు సార్లు స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించడం అభినంద నీయమని అన్నారు. మానసికంగా ఒత్తిడి ని అధిగమించేందుకు శారీరక శ్రమ దృఢత్వం అవసరమని సూచించారు. క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు.జర్నలిస్టులు క్రీడా స్ఫూర్తిని ఛాటాలన్నారు. మొదటి రోజు మూడు లీగ్ మ్యాచ్ లు జరుగగా రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధించాయి. గంగా టీం వర్సెస్ హరిద్ర టీం పోటీ పడగా మొదట క్రీడాకారుల సమక్షంలో హరిద్ర  టిమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ పెంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో 98 పరుగులు చేసింది. గంగా టింకు లక్ష చేదనగా 99 పరుగులు ఇచ్చారు. అనంతరం బ్యాటింగ్లో దిగిన గంగా టీం నిర్మిత 12వ వార్డులో 98 పరుగులు చేసి డ్రాగ మ్యాచ్ కొనసాగింది. అనంతరం ఎంపైర్లు క్రికెట్ టీం ఇన్చార్జిలు కలిసి సూపర్ ఓవర్గా చేస్తూ మ్యాచును ప్రారంభించారు. మొదట గంగా టీం బ్యాటింగ్ చేయగా సూపర్ ఓవర్లో ఆరు బాలల్లో 10 రెండ్లు చేసి పదకొండురంగలను టార్గెట్ ఇచ్చారు. నిర్ణీత సూపర్ ఓవర్లో హరిద్ర టీం నాలుగు బాళ్లలో లక్ష్యాన్ని చేదించి విజయం సాధించింది. ఈకార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్ లతో పాటు క్రికెట్ పోటీల నిర్వాహకులు గోవిందరాజు, మైపాల్, సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.