క్రీడలు యువతకు ఎంతో అవసరం

– నెల్లికుదురు ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్
నవతెలంగాణ నెల్లికుదురు : క్రీడలు యువతకు ఎంతో అవసరమని నెల్లికుదురు ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్ అన్నారు మండలంలోని రతిరం తండా గ్రామానికి చెందిన నరేంద్రనాథ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్, కాబడ్డి ,వాలీబాల్, ముగ్గుల పోటీ ,క్యారం బోర్డు, చెస్ పోటీలను ఆ గ్రామ ఎంపీటీసీ గుగులోతు మదన్ లాల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ తో కలిసి శనివారం క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన యువతు సభ్యులు సంక్రాంతి పండుగ పర్వదినని పురస్కరించుకొని చాలా రకాల క్రీడలను నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ఎలాంటి అల్లాలు జరగకుండా ప్రశాంతంగా క్రీడలు నిర్వహించుకోవాలని యువతకు సూచించినట్లు తెలిపారు యువత క్రీడలతోపాటు అన్ని రంగాలుగా అభివృద్ధి చెందేందుకు యువత ముందుకు సాగాలని అన్నారు రేపటి సమాజం కోసం యువత కృషి చేయాలని తెలిపారు ఇలాంటి క్రీడలు నిర్వహించడం శరీరానికి ఒక వ్యాయామం లాంటిదని అన్నారు యువకులు ఉత్తేజంగా ఉండేందుకు మరియు ప్రభుత్వ నౌకరి రావడానికి ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో యువకులు ఒకే వేదిక ఏర్పాటు చేసుకొని పార్టీలకు అతీతంగా గ్రామంలో ఇలాంటి నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ప్రధానం చేయునట్టు తెలిపారు ఈ బహుమతులను పార్వతీదిన గ్రామంలో గ్రామ ప్రజల మధ్యల గెలుపొందిన వారికి బహుమతులను అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సురేష్ అనిల్ సాగర్ నరేష్ పవన్ సోమన్న మాజీ ఎంపీటీసీ మస్తాన్ మాజీ ఉప సర్పంచ్ సెట్రం తదితరులు పాల్గొన్నారు