క్రీడలు శరీరకంగా యువకులకు ఎంత అవసరం

– క్రికెట్ కిట్ల పంపిణీలో సర్పంచ్ రాజ్ కుమార్ పటేల్

నవతెలంగాణ – మద్నూర్
క్రీడలు చదువుతోపాటు శరీరకంగా యువకులకు ఎంతో అవసరమని డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ పటేల్ తెలిపారు. ఆ గ్రామ యువకులకు గ్రామ సర్పంచ్ గా క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరంలో క్రికెట్ ఆట యువకుల్లో ఎంతో ఉత్సవ పరుస్తోందని ప్రతి ఒక్కరికి శరీరకంగా క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ యువకులు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.