క్రీడా భారతి

Sports Bharatవంద పతకాలు లక్ష్యంగా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల బరిలో దిగిన మన క్రీడాకారులు… దానిని చేరుకోవడమేకాదు.. డెబ్భై రెండేండ్ల ఈ క్రీడల చరిత్రలో 28 స్వర్ణాలు సహా 107 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. అనేక ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇంతటి ఘనవిజయం సాధించడం మన క్రీడాకారుల కఠోర శ్రమ, సాధన తోనే సాధ్యమైంది. ఆ పట్టుదలే పతకాల పట్టికలో ఇండియాను నాలుగో స్థానంలో నిలబెట్టింది. మూడు ప్రధాన క్రీడా సంరంభాలను గమనిస్తే భారత క్రీడారంగం అమోఘంగా పురోగమించిందనేది నిర్వి వాదాంశం. 1951లో తొలి ఆసియా క్రీడల ఆతిథ్య దేశంగా రెండో ర్యాంకు పొందిన దరిమిలా 5-11 స్థానాలకే పరిమితమైన భారత క్రీడాకారులు ఈ సారి మెరుగైన ర్యాంకుతోపాటు వందకుపైగా పతకాలు సాధించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గురితప్పకుండా మూడేసి స్వర్ణాలు గెలుపొందిన జ్యోతి, ఓజస్‌ ప్రవీణ్‌ల ప్రదర్శన చిరస్మర ణీయం. బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌ జోడీ చారి త్రక పసిడిని ఒడిసి పట్టింది. ఆర్చరీ, కబడ్డీ, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, అథ్లెటిక్స్‌ తదితరాల్లో క్రీడాకారులు ప్రదర్శించిన దూకుడే భారత్‌కు పతకాల పంట పండించింది. వ్యవస్థాగత తోడ్పాటు లభిం చకపోయినా ఏటికి ఎదురీదుతూ గొప్ప విజ యాన్ని దేశానికి అందించారు. ఎప్పటిలాగే చైనా 383 పతకాలతో అగ్రపీఠాన్ని నిలబెట్టు కుంది. మన దేశ జనాభాలో పదోవంతు కూడా లేని జపాన్‌ 52 స్వర్ణాలతో 188 పతకా లతో ద్వితీయ స్థానంలో, దక్షిణ కొరియా 42 స్వర్ణాలతో మొత్తం 190 పతకాలతో తృతీయ స్థానంలో నిలిచాయి. వాటితో పోల్చినపుడు 140 కోట్లకు పైబడిన జనాభాతో తులతూ గుతున్న ఇండియా క్రీడరంగంలో నేర్వాల్సింది, సాధిం చాల్సింది ఎంతో ఉందన్న యథార్థం ప్రస్ఫుట మవుతోంది. కానీ, పాలకులు ఆ వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు.
నాలుగు దశాబ్ధాలుగా ఆసియా క్రీడల్లో అగ్రస్థానంతో నిలుస్తుంది చైనా. ఏ క్రీడలైనా ఇదే పరిస్థితి. అక్కడి ప్రభుత్వాలు క్రీడలకు అంతటి ప్రాధాన్యత ఇవ్వ డమే ఈ ఘనతకు కారణం. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వ్యాయామశాలలు నెలకొల్పిన చైనా పసిప్రాయంలోనే ప్రతిభావం తుల్ని గుర్తించి విస్తృత శిక్షణతో రాటు తేలుస్తోంది. దాదాపు ప్రతి బడిలోనూ మైదానం ఉండేట్టు జపాన్‌ తీసుకున్న జాగ్రత్త పాఠశాలలోనే పిల్లల్లో క్రీడాభినివేశాన్ని పెంపొందిస్తోంది. ముడి వజ్రాల్లాంటి యువ క్రీడా కారులను పసిగట్టి శాస్త్రీయ శిక్షణ ఇవ్వడంలో ‘చైనా మోడల్‌’ అను సరిస్తున్న దక్షిణకొరియా జాతీయ అథ్లెట్లకు తోడ్పాటు కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని తీర్చి దిద్దింది. దక్షిణ కొరియాలో పురుషులు 28 ఏండ్లు వచ్చేలోగా 18 నెలల పాటు సైన్యంలో విధిగా సేవలందించాల్సి ఉంటుంది. ఒలిం పిక్‌ పతకంగాని, ఆసియా క్రీడల్లో గోల్డ్‌ మెడల్‌గాని సాధించిన వారికి ఆ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. ఆత్మ విశ్వాసానికి రెక్కలు తొడిగి, జాతి చేవకు పుష్టికి దర్పణం పట్టే క్రీడల ప్రాముఖ్యాన్ని గుర్తెరిగిన దేశాలు పునాది నుంచే మౌలిక వసతుల కల్పనకు విశేష ప్రాధాన్యమిస్తు న్నాయి. ఆ ఒరవడే ఆయా దేశాలకు ప్రతిష్టా త్మక వేదికలపై పతకాల పంట పండిస్తోంది.
కానీ, మన దేశంలో తత్‌భిన్నమైన పరిస్థితి. క్రీడాకారులు స్వశక్తి తో పోరాడి పతకాలు సాధించుకొస్తే, అప్పుడు మాత్రమే వారిని గుర్తించి పోటీలు పడి నగదు బహుమతులు ప్రకటించి, క్రీడలను మేమే ప్రోత్సహిస్తున్నామని చెప్పుకోవడం మినహా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? మనకు సరైన క్రీడా విధానం లేదు కాబట్టే అంత ర్జాతీయ క్రీడా వీధుల్లో నగుబాటు తప్పడం లేదు. క్రీడల పట్ల, వాటి అభివఅద్ధి పట్లా నిజాయితీ, చిత్తశుద్ధీ లేని పరిస్థితి దేశమంతా ఉంది.
బ్రిజ్‌భూషణ్‌ లాంటి నేతలను భారత క్రీడా సమాఖ్యలకు రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షులుగా పెట్టుకున్నాక ‘మన బేటీ బచావో, బేటీ పడావో’ వంటివి కేవలం నినాదాలే అనేది స్పష్టం అవుతోంది. క్రీడల పట్ల ఆసక్తి ఉండి, ప్రతిభ ఉండి అవకా శాలు లేక, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాణించ లేకపోతున్న లక్షలాది మంది క్రీడాకారులకు సరైన వనరులు, వసతులు కల్పించే క్రీడా విధానం మనకుందా? అది లేదు కాబట్టే ఒలింపిక్స్‌లో ఒకటి, రెండు పతకాలతోనే సరిపెట్టుకుం టున్నాం. వాటితోనే రాజకీయ పబ్బం గడుపుకోవాలని మన నేతలు రాజకీయ క్రీడలు ఆడుతున్నారు. దేశీయంగానూ అంద రికీ అందుబాటులో ఉండేలా ప్రతి రాష్ట్రంలో క్రీడా మైదానాలు, మౌలిక వసతుల కల్పన, ప్రతిభావంతులకు సరైన ప్రోత్సాహ కాలు అందించే వ్యవస్థ సాకారం కావాలి. సహజ ప్రతిభకు కొదవ లేని దేశంలో ఇతోధికంగా ప్రభుత్వాలు తోడ్పాటు సమకూరితే తప్ప ఇది సాధ్యం కాదు. అప్పుడే మన పతకాల దాహార్తీ తీరుతుంది! క్రీడా కారులు ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో ముందుకుసాగితే వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో మనకు మరిన్ని పతకాలు లభించడం ఖాయం.