క్రీడలు క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితిస్తాయి

– క్రీడలలో గెలుపోటములు సహజం
– ఓటమి కూడా అత్యున్నత క్రీడాకారులను తయారుచేస్తుంది
– యాదాద్రి భువనగిరి జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
– తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రగ్బీ టోర్నమెంట్ క్రీడోత్సవములు
– పాల్గొన్న 30 జిల్లాల క్రీడాకారులు, సుమారు 850 మంది క్రీడాకారులు
నవతెలంగాణ –  యాదగిరిగుట్ట రూరల్
క్రీడలు ఉల్లాసంతో ప్రేమ భావంతో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితిస్తాయి అని యాదాద్రి భువనగిరి జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.  యాదగిరిగుట్ట మండలం కాచారం ఆదివారం, ఆయన మాట్లాడుతూ బీబీనగరం లక్ష్మణ్ కాచారం గ్రామంలో పుట్టడం, ఆలేరు నియోజకవర్గ ప్రాంత వాసి కావడం, మొదటి నుంచి కూడా క్రీడలు అంటే మక్కువ ఉండటం యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారుల అదృష్టం అని అన్నారు. చాలామంది స్వంత పనులకే టైం ఇవ్వని రోజులు బీబీనగరం లక్ష్మణ్ క్రీడాకారుల కోసం అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఆటలు ద్వారా జాతీయస్థాయి క్రీడాకారులు తయారవుతారని అన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని కొన్నిసార్లు ఓటమి కూడా అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి బీబీనగర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ రగ్బీ టోర్నమెంట్ క్రీడలలో బాలురు ఫైనల్ విజేత  జనగాం, రన్నరప్ రంగారెడ్డి, బాలికల ఫైనల్ విజేత మహబూబ్ నగర్, రన్నరప్ సంగారెడ్డి జిల్లాల క్రీడాకారులు గెలుచుకున్నారు. ఈ రగ్బీ క్రీడలలో 30 జిల్లాలకు చెందిన బాల బాలికలు 850 మంది పాల్గొన్నారు. ఈ క్రీడలను స్థానిక ఎంపిటిసి ఎడ్ల సుగుణమ్మ రామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేగు బాలనరసయ్య, డివైఎస్ఓ ధనుంజయ్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ స్టాలిన్ బాబు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యక్షులు దశరధ రెడ్డి, జోసెఫ్, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు కర్ణం గణేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మంగళపల్లి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.