మూడురోజుల పాటు స్పోర్ట్స్ క్యాంప్

Sports camp for three daysనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈనెల 26, 27, 28 తేదీలలో స్టేడియంలో స్పోర్ట్స్ క్యాంప్ నిర్వహించబడుతుందని మున్సిపల్ కౌన్సిల్ ఫోరం జిల్లా అధ్యక్షుడు బండారి సతీష్ తెలిపారు. మంగళవారం క్యాంప్ కు సంబంధించిన పోస్టర్లను పట్టణంలో ఆవిష్కరించారు. పట్టణంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు ఈ స్పోర్ట్స్ లో పాల్గొనాలని కోరారు. పిల్లలు చదువుతోపాటు స్పోర్ట్స్ లో కూడా రాణించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాస్టర్ మైండ్ స్కూల్ డైరెక్టర్ సాయిని రవికుమార్, ప్రిన్సిపల్ వసీం, పిఈటి కళ్యాణ్, సురేష్ మేనేజర్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.