
– బొల్లెపల్లి లో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం
నవతెలంగాణ -తాడ్వాయి
క్రీడలు మానసికోల్లాసానికి, శరీర ధారుఢ్యానికి ఉపయోగపడతాయని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ధనసరి సూర్య, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ లు అన్నారు. శనివారం మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములు పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం అల్లిగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి ప్రభాకర్ కూతురు కర్ణ వేదన ఫంక్షన్కు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం లింగాల బంధాల గ్రామాల ఎంపిటిసి పరిధిలోని క్లస్టర్ ఇంచార్జిలను నియమించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, మేడం టస్పోర్ట్ చైర్మన్ లంచ్ పటేల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు వంటిది ప్రశాంత్, నాయకులు సునీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.