నవతెలంగాణ – ధర్మారం
క్రీడలతో యువకులకు మానసికల్లాసం పెరుగుతుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని నంది మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలి బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను ప్రారంభించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, క్రీడలతో మానసికొల్లాసం పెరుగుతుందని,క్రీడల్లో ప్రతిభ ఉండి ఆర్థికంగా లేని క్రీడాకారులు నన్ను సంప్రదించాలని, వారికి నేను మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటామని, క్రీడాకారులకు ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడాకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు దేవి జనార్ధన్ కారేటి వేణు టోర్నీ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.