– 7,8 తేదీలలో గ్రామస్థాయిలో క్రీడా పోటీలు
– 10 నుండి 12 తేదీల్లో మండల స్థాయి క్రీడలు,
– మండల ప్రత్యేక అధికారి నాగరాజ్
నవతెలంగాణ మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్నూర్ ఉమ్మడి మండలంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 7, 8 తేదీలలో గ్రామస్థాయిలో క్రీడలు అదేవిధంగా ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు మండల స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని మండల ప్రత్యేక అధికారి నాగరాజ్ తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే క్రీడలు మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్టు నాగరాజు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మండల స్థాయిలో గెలిచిన క్రీడా జట్లకు జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందని పాల్గొనదలచిన క్రీడాకారులు సీఎం కప్పు కోసం రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా నిర్వహించే క్రీడలు వాలీబాల్, ఫుట్ బాల్, కబడ్డీ, కోకో, అథ్లెటిక్స్, యోగా క్రీడలు జరుపబడతాయని తెలిపారు. గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించాలని ప్రకటన ద్వారా మండల ప్రత్యేక అధికారి తెలియజేశారు.