నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో శనివారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి బాలయ్య హైకోర్టు అడ్వకేట్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటల వలన విద్యార్థులలో శారీరక ఆరోగ్యం మరియు మానసిక దృఢత్వం పెంచడానికి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి అని అన్నారు. వివేకానంద స్వామి ఆటలు మనకు ధైర్యం, సంకల్పం, సమర్థత ను నేర్పిస్తాయని ప్రతి ఆట మన జీవితంలోని సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుందని చెప్పారు. దానితో పాటు విద్యార్థులలో సమాజ సేవ, సహకారం, మరియు స్నేహపూర్వక వాతావరణం పెరిగే అవకాశం ఉన్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఆటల వలన మానసిక ఉల్లాసం మరియు ఉత్సాహం పెరుగుతుంది. విదేశీ పర్యటనలో చాలా పాఠశాలలు మేము సందర్శించినప్పుడు వారు ఆటలు కూడా చదువులో భాగమని చెప్పారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆటలకు ఏ పాఠశాలలు కూడా ఆసక్తిని చూపలేకపోతున్నాయి. కాబట్టి విద్యార్థులలో ఉన్న నూతన ప్రతిభ వెలికి తీసి విద్యార్థులలో ప్రేరణ కలిగించడానికి క్రీడలు తోడ్పడతాయి అని అన్నారు . ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.