– రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిపై గురుతర బాధ్యత ఉంది
– జిల్లా పేరును చిరస్థాయిగా నిలిపేలా ప్రతిభ చూపాలి
– ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ-కలెక్టరేట్
నల్లగొండలో జిల్లా కేంద్రం మేకల అభినవ్ స్టేడియం, ఇండోర్ స్టేడియం లలో ఈ నెల 22 నుండి 24 వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ 2023 జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ముగిసాయి.బుధవారం మేకల అభినవ్ స్టేడియం లో ముగింపు కార్యక్రమానికి నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్రీడా పోటీలు నిర్వహించాలని సంకల్పించి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. క్రీడల ద్వారా యువతలో స్నేహభావం పెంపొందుతుందన్నారు. అట్లాగే రోజు వ్యాయామం, క్రీడలలో పాల్గొనడం ద్వారా దేహదారుఢ్యం, ఆత్మస్థైర్యం, ధైర్యము, మొదలగునవి పెంపొందించుకోవచ్చని ఆయన అన్నారు. సీఎం ప్రోత్సాహంతో గ్రామస్థాయి క్రీడాకారులను గుర్తించి మండలాలలో పోటీలు నిర్వహించడం జరిగిందని అందులో ఎంపికైన వారిని జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులపై గురుతరమైన బాధ్యత ఉందన్నారు. రాష్ట్రస్థాయిలో నల్లగొండ జిల్లా పేరు చిరస్థాయిలో నిలిచేలా మంచి ప్రతిభ కనబరిచి అన్ని క్రీడలలో ఉత్తమ బహుమతులు గెలుచుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీలలో పురుష విభాగంలో దామరచర్ల, నల్లగొండ, కేతపల్లి, స్త్రీ విభాగంలో నిడమనూరు, కేతపల్లి, చందంపేటలు విజేతలుగా నిలిచాయి. కో కో పోటీలలో పురుష విభాగంలో అడవిదేవులపల్లి, దేవరకొండ, గుర్రంపోడు, స్త్రీ విభాగంలో నల్లగొండ, కనగల్, నార్కట్ పల్లి విజయతలుగా నిలిచాయి. కబడ్డీలో పురుష విభాగంలో మిర్యాలగూడ, పెద్ద అడిశర్ల పల్లి, త్రిపురారం, స్త్రీ విభాగంలో అనుముల, కట్టంగూరు, త్రిపురారం విజేతలు గా నిలిచారు. ఫుట్ బాల్ లో మిర్యాలగూడ, గుర్రంపోడు, నల్లగొండ విజయతలుగా నిలిచాయి. అదే విధంగా షాట్ పుట్, లాన్గ్ జంప్, మొదలగు క్రీడలలో గెలుపొందిన వారికి ఆయన బహుమతులు ప్రధానం చేశారు. క్రీడా పోటీలలో భాగంగా నత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా క్రీడల అధికారి మక్బూల్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.