క్రీడలు శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి 

– దుద్దిళ్ళ శ్రీను బాబు 
నవతెలంగాణ-మల్హర్ రావు : సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన శ్రీపాద కప్ క్రికెట్ టోర్నమెంట్  విజేతలకు  మొదటి బహుమతి వెంకీ ఎలెవన్స్  జట్టు కు లక్ష రూపాయలు ,రెండవ బహుమతి చక్ దే జట్టుకు రూ.50 వేళ రూపాయలను దుద్దిళ్ల శ్రీనుబాబు ముఖ్య అతిదిగా పాల్గొని బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు యువకులు క్రీడల్లో రాణించాలని,క్రీడలపై మక్కువ పెంచుకోవాలన్నారు.యువకులు ఏదో ఒక ఆట నేర్చుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని,.మారుతున్న జీవన విధానం లో క్రీడలు చాలా అవసరం, క్రీడలు మనకు మానసిక ఉల్లాసాన్ని ,సాధించాలనే పట్టుదల ను కలిగిస్తాయన్నారు.క్రీడల్లో గెలుపోటములు సహజము దానిని స్పోర్టివ్ గా తీసుకుని స్నేహ భావాన్ని పెంపొందించుకోవాలన్నారు.క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని దేహదారుఢ్యం కలిగిస్తాయన్నారు.చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.