లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రీడా దినోత్సవ వేడుకలు..

Sports Day celebrations under the auspices of Little Flower Educational Institution.– క్రీడలు మన నిత్య దినచర్యలో భాగం కావాలి..
– పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయి:  చైర్మన్ .డా.కె.సదానంద్
నవతెలంగాణ – ఓయూ
లిటిల్ ఫ్లవర్ విద్యా సంస్థలు ఓల్డ్   అల్వాల్, వెంకటాపురం  విద్యా సంస్థ ప్రారంభమై 20వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని, శుక్రవారం  ‘క్రీడా దినోత్సవ వేడుకను ఓల్డ్ అల్వాల్ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుకను వెంకటాపురం హెడ్ మిస్టర్స్  నాగజ్యోతి  ప్రారంభిస్తూ, విశిష్ట అతిధులను స్వాగతించారు. అనంతరం లిటిల్ ఫ్లవర్ విద్యా సంస్థల చైర్మన్  డాక్టర్ కె. సదానంద్ ‘ జ్యోతి ప్రజ్వలన’ చేసి క్రీడా దినోత్సవ వేడుకను ప్రారంభించారు. అనంతరం లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ శరత్ చంద్ర భార్గవ్ గాలిలో బెలూన్లు వదిలి విద్యార్థులలో క్రీడోత్సవ ఉత్సాహాన్ని నింపారు.
 లిటిల్ ఫ్లవర్ విద్యా సంస్థల ప్రిన్సిపల్  జ్యోతి సదానంద్ వివిధ క్రీడల్లో క్రీడా నైపుణ్యాన్ని దాటి, విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేసి, వారిని అభినందించారు.  లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కె. సదానంద్ విద్యార్ధులను,అతిధులను ఉద్దేశించి మాట్లాడుతూ. క్రీడలు మన దినచర్యలో ముఖ్యపాత్ర వహించాలని, క్రీడలతోనే విద్యార్థులకు పోటీ తత్వం అలవడుతుందని తెలియజేస్తూ, క్రీడలు మానసిక ఆనందానికి, శారీరక దృఢత్వానికి దేహదపడతాయని , విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే క్రీడా నైపుణ్యాన్ని దాటడానికి ఒక మంచి వేదిక అవుతుందని, తమ పాఠశాల విద్యార్థులు జిల్లా, మండల, జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, అనేక పతకాలను, అవార్డులను అందుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్ధులు బాల్యం నుండే క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని, పోటీల్లో గెలుపు ఓటములు సహజమని వాటిని పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని చక్కటి సందేశాన్ని అందించారు. పాఠశాల ఉపాధ్యాయులు క్రీడలలో విద్యార్థులకు చక్కటి శిక్షణ ఇస్తున్నారని వారిని అభినందించారు.
అనంతరం లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపాల్ శివలిరాయ్వార్షికోత్సవ నివేదికలో తమ విద్యాసంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, శారీరక మానసిక దృఢత్వానికి దోహదపడే క్రీడలలో ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నామని విద్యార్థులు కూడా పోటీ తత్వంతో తమ జట్టు విజయం కోసం పోటాపోటీగా తమ సత్తాను చాటుతూ అనేక అవార్డులను అందుకుంటున్నారని, పాఠశాలకు మంచి పేరును తెచ్చి పెడుతున్నారని వారి అభినందించారు.విద్యా విధానంలో చోటు చేసుకుంటున్నా నూతన విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నాణ్యమైన విద్యను బోధించడంలో తమ ఉపాధ్యాయులు కృషి, పట్టుదల గొప్పదని ప్రశంసించారు. లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థలో చదువుకున్న విద్యార్థులు ఈనాడు పలు రంగాలలో ఉన్నత స్థాయిలో ఉంటూ దేశానికి ఎంతో కృషి చేస్తున్నారని పూర్వ విద్యార్థులను కొనియాడారు.ఈ కార్యక్రమంలో టెంపుల్ ఆల్వాల్, ఓల్డ్ అల్వాల్, వెంకటాపురం విద్యార్థులు సంగీతానికి అనుగుణంగా లయబద్దంగా అతిధులను మైమరిపిస్తూ వివిధ భంగిమలతో కూడిన విన్యాసాలను ప్రదర్శించి ఔరా అనిపించారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ, దేశభక్తితో కూడిన అనేక పిరమిడ్లను ప్రదర్శించి అందరి చేత సభాష్ అనిపించుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కరతాళ ధ్వనులతో పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా కేరింతలు కొడుతు క్రీడా స్ఫూర్తి ని నింపారు..అనంతరం టెంపుల్ అల్వాల్ హెడ్ మాస్టర్  లక్కీ శామ్యూల్  వందన సమర్పణ చేయగా, జాతీయగీతంతో క్రీడ దినోత్సవం ఘనంగా ముగిసింది.